calender_icon.png 1 February, 2026 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో పలుచోట్ల వర్షం

04-10-2024 12:43:24 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (విజయక్రాంతి): నగరంలోని పలుచోట్ల గురువారం సాయంత్రం వర్షం కురిసింది. మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, సైదాబాద్, ఎల్.బీ.నగర్, అంబర్‌పేట, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, సంతోష్ నగర్ ప్రాంతాల్లో 2 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా, సరూర్‌నగర్, ఉప్పల్, ముషీరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో 1 సెంటీ మీటర్ వర్షపాతం నమోదయ్యింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. ట్రాఫిక్‌జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.