calender_icon.png 9 May, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీనగర్‌లో వర్ష సహాయక చర్యలు

08-05-2025 12:47:24 AM

ముషీరాబాద్, మే 7 (విజయక్రాంతి) : మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి గాంధీనగర్ డివిజన్ లోని వాల్మీకి నగర్ బస్తి సమీపంలో గల ఉదయ్ సూర్య అపార్ట్మెంట్స్ వద్ద భారీ చెట్టు కూలడంతో అక్కడే వున్న కరెంట్ జంక్షన్ కూలింది. చెట్టు కూలి విధ్ధ్యుత్ సరఫరా ఆగిపోయి స్థానికులు భయబ్రాంతులకు గురైయారు.

గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ సమాచారం అందించారు. వెంటనే స్పందించిన కార్పొరేటర్ ఎమర్జెన్సీ డీఆర్‌ఎఫ్ సిబ్బంది, ఎలక్ట్రికల్ అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. కార్పొరేటర్ సూచనల మేరకు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని డీఆర్‌ఎఫ్ సిబ్బంది ద్వారా చెట్టు కొమ్మలు తొలగింపచేశారు.

ఎలక్ట్రికల్ సిబ్బంది ద్వారా తెగి పడిన విద్యుత్ తీగలను క్రమబద్ధీకరించే పనులను చేపట్టారు. కరెంట్ జంక్షన్ కులడం వల్ల విద్యుత్ సరఫరాలో నిలిపివేసిన సిబ్బందితో బుధవారం అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ సీబీడీ డిపాట్మెంట్ వినోద్, అసిస్టెంట్ ఇంజనీర్ గాంధీనగర్ సంతోష్ వారి సిబ్బంది ద్వారా కరెంట్ సరఫరాను  పునప్రారంభించారు. బీజేపీ నేతలు విఎస్ టీ రాజు, మహమూద్, ఎం.ఉమేష్, నర్సింహ, సుక్క యాదగిరి ఉన్నారు.