calender_icon.png 9 May, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సందడిగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు

08-05-2025 12:47:00 AM

  1. మరికొంత మంది ‘మిస్ వరల్డ్’ పోటీదారుల రాక

20 రోజులపాటు ఈనెంట్స్

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): 72వ  ప్రపంచ సుందరి పోటీలు సందర్భం గా హైదరాబాద్ నగరం సందడిగా మారిం ది. ఈనెల 10వ తేదీ నుంచి గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభంకానున్న నేపథ్యంలో బుధవారం మరికొంతమంది పోటీదారుల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. వీరిలో మిస్ సింగపూర్ డెల్వినా కాటెరినా కే లూథర్, మిస్ మిస్ లాట్వియా మరీజా ఎలిజబెట్ మిసురోవా, మిస్ మంగోలియా ఎర్డెన్సవ్డ్ బాట్బయార్, మిస్ నికరాగ్వా రోడ్రిగ్జాగ్లు, మిస్ డెన్మార్క్ ఎమ్మా హేస్ట్ థామ్సన్, మిస్ కజకిస్తాన్ సబీనా ఇడ్రోసోవాలు ఉన్నారు.

వీరితో పాటు మిస్ మైన్మార్, మిస్ వియత్నాం, మిస్ అమెరికా, మిస్ ఆర్మేనియా, మిస్ ఇథోపియాలు బుధవారం శంషాబాద్ అంత ర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లుగా అధికారులు వివరించారు. వీరికి అధికారులు సాదర స్వాగతం పలికారు.

ఇప్పటి వరకు మొత్తం 65 మంది హైదరాబాద్‌కు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ కల్చర్, హెరిటేజ్,  సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు పరిచ యం చేసేలా 20 రోజులపాటు మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్‌గా జరగనున్నాయి.