calender_icon.png 22 August, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనస్థలిపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఏసీబీ అధికారుల తనిఖీలు

22-08-2025 06:14:11 PM

ఎల్బీనగర్: వనస్థలిపురంలోని సబ్ రిజిస్టర్ ఆఫీసు లో అవినీతి పై ఏసీబీ అధికారులకు పలు ఫిర్యాదులు రావడంతో శుక్రవారం దాడులు నిర్వహించారు. స్థల రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో వనస్థలిపురం సబ్ రిజిస్టర్ ఆఫీసు లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే  వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ రాజేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా సోదాలు జరుగుతున్నాయి, పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.