22-08-2025 06:18:24 PM
రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): రామకృష్ణాపూర్ పట్టణంలో స్వయంభుగా అమ్మవారి ప్రతిమ వెలిసినట్లు సమాచారం తెలుసుకున్న స్థానికులు అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా పోటెత్తారు. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం పట్టణంలోని ఆర్కే వన్ మార్కెట్ ఏరియాకు చెందిన ఓ మహిళకు స్వప్నంలో కనబడి ఆమెపై అమ్మవారు పూనుకోవడంతో ఆ కాలనీకి చెందిన పలువురు బతుకమ్మ ఘాట్ సమీపంలో పక్కన స్వయంభుగా వెలిసిన అమ్మవారి ప్రతిమను గుర్తించినట్లు తెలిపారు.ఆ ప్రాంతవాసులు ఆరాధ్య దేవతగా కొలుస్తున్న అమ్మవారి విగ్రహం శుక్రవారం రోజున కనిపించడంతో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అమ్మవారి ప్రతిమను స్థానిక హనుమాన్ మందురనికి తరలించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.