calender_icon.png 22 August, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్వాడీలు గో బ్యాక్ వ్యాపారస్తుల నిరసన

22-08-2025 06:07:42 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణపై మార్వాడీల జులుం నిరసనగా ఓయూ జేఏసీ పిలుపుమేరకు తుంగతుర్తి పట్టణ కేంద్రంలోని పలువురు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బందు నిర్వహించి, మార్వాడిస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఉద్యోగాలు, నిధులు నియామకాలు లక్ష్యంతో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, తెలంగాణలో మార్వాడీలు హక్కులను కాలరాస్తూ, దౌర్జన్యాలకు పాల్పడం హేయమైన చర్య అని అన్నారు. తుంగతుర్తి పోరాటాల గడ్డ అని కొనియాడారు. తెలంగాణ మార్వాడీలు కొంతమంది నాసిరకం సరుకులను తెచ్చి, తక్కువ ధరలకు అమ్ముతూ, తెలంగాణ వ్యాపారస్తులను వ్యాపారాల్లో కుదేలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి పట్టణ వస్త్ర, వ్యాపార సంఘ సభ్యులు పాల్గొన్నారు