4 August, 2026 | 10:29 AM

వాగును తలపిస్తున్న రోడ్డు

04-08-2026 09:52 AM

పాల్వంచ శ్రీనివాస కాలనీలో దమ్మపేట రోడ్డు పరిస్థితి 

డ్రైనేజీల ఆక్రమణ పరిస్థితికి కారణం

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శ్రీనివాస కాలనీ రోడ్డు వాగును తలపిస్తోంది. పాల్వంచ నుంచి దమ్మపేట వైపు వెళ్లే మార్గంలో వరద నీరు చేరి వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. ప్రతి ఏటా వర్షాకాలంలో శ్రీనివాస్ కాలనీ రోడ్డు తీవ్ర ఆటంకంగా మారుతుంది. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం, కాలువలను ఆక్రమించి భవనాలు నిర్మించటమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు ఏ మార్గంలో శాశ్వత పరిష్కారాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.