4 August, 2026 | 10:52 AM

చెరువు నిండింది... అలుగు పారింది

04-08-2026 09:49 AM

ఆనందోత్సవంలో రైతన్నలు

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామ చెరువు తిమ సముద్రం నిండడంతో అలుగు పొంగి పొర్లడంతో గ్రామస్తులు రైతులు ఆనందోత్సవాలు మునిగిపోయారు. చెరువు కింద వారినట్లు జోరుగా కొనసాగుతున్నాయి. నెల రోజులు ఆలస్యంగా వర్షాలు కురవడంతో రైతులు ఆందోళన చెందినప్పటికీ భారీ వర్షాలకు చెరువులు నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గ్రామ చెరువు నిండడంతో చెరువు వైపు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ సర్పంచ్ రాజా గౌడ్ సూచించారు.