4 August, 2026 | 10:51 AM

కూరలో గడ్డిమందు కలిపి భర్త, అత్తకు పెట్టిన ఇల్లాలు

04-08-2026 09:33 AM

నిజామాబాద్: జిల్లాలోని మోపాల్ మండలం ముదక్‌పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కారణంతో భర్త, అత్తలను హత్యాయత్నానికి ఓ వివాహిత కూరలో గడ్డిమందు కలిపి పెట్టింది. ఆ కూర తిని అత్త భూదేవ్వ వాంతులు, విరేచనలు కావడంతో ఆమెను ఆసుపత్రిలో చేరారు. భోజనం వేస్తుండగా గడ్డమందు వాసన రావటంతో అప్రమత్తమైన భర్త భూమన్న, భార్య సోనిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని భార్య సోని విచారించడంతో నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో భర్త ఫిర్యాదుతో నిందుతురాలిని అరెస్టు చేశారు.