calender_icon.png 23 July, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసీల్దార్ కి ఉపాధ్యాయ సంఘం పోరాట కమిటీ సభ్యుల వినతి పత్రం

23-07-2025 02:57:38 PM

నూతనకల్,(విజయక్రాంతి): ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, బుధవారం తహసిల్దార్(Tahsildar) శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా అధ్యక్షుడు నన్నబోయిన సోంబాబు,జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న లు మాట్లాడుతూ సి పి ఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ పునరుద్ధరించాలని, అన్ని రకాల పెండింగ్  బిల్లులను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు.అన్ని క్యాడర్ల బదిలీలు,పదోన్నతులు షెడ్యూల్ను తక్షణమే విడుదల చేయాలని,ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘ సభ్యులు ఇరుగు యాదగిరి, రాంపల్లి శ్రీను,దామెల్ల వెంకన్న, రెబ్బ వెంకటేశ్వర్లు,రేణుక తదితరులు ఉన్నారు.