calender_icon.png 23 July, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

23-07-2025 03:09:01 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి రోగులకు మెరుగైన వైద్యం అందించేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. రోగులకు అందుతున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అన్ని వార్డులను పరిశీలించి మందుల వివరాలు డాక్టర్ల పనితీరుపై ఆరా తీశారు. రోగులతో కలిసి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ వైద్యులు రమ్య మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తాసిల్దార్ రాజు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు