calender_icon.png 23 July, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ఏర్పాటుకు ప్రత్యేక నిధులు

23-07-2025 02:49:00 PM

మాజీ జెడ్పిటిసి అరిగెల నాగేశ్వరరావు

కుమ్రంభీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): గ్రామాలలో విద్యుత్ దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మాజీ జెడ్పిటిసి అరిగెల నాగేశ్వరరావు అన్నారు. ఆసిఫాబాద్ మండలంలోని(Asifabad Mandal) హీరాపూర్ గ్రామంలో బుధవారం ఎంపీ నిధులతో మంజూరైన ఎల్ఈడీ విద్యుత్ దీపాలను  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో హీరాపూర్ గ్రామంలో పర్యటించినప్పుడు గ్రామంలో ఎల్ఈడీ దీపాలు లేక వర్ష కాలం రాత్రి సమయాలలో ఇబ్బందులు ఎదురుకుంటున్నారని తమ దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఎంపీ గేడం నాగేష్ దృష్టికి తీసుకువెళ్లి ఎంపీ నిధులతో ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.40 లక్షల రూపాయల నిధులతో త్వరలోనే ఆసిఫాబాద్ పట్టణంలో ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  నాయకులు దీపక్ రావ్,శ్రీకాంత్ తదితరులున్నారు.