calender_icon.png 23 July, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాళం వేసి ఉన్న ఇండ్లే వారి టార్గెట్

23-07-2025 02:54:24 PM

అంతర్ జిల్లా దొంగలను ముఠా అరెస్టు 

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): గత సంవత్సర  కాలం నుండి తెలంగాణ రాష్ట్రం(Telangana State) లోని  రాచకొండ, వరంగల్, సైబరాబాద్  కమీషనరేట్ పరిదిలలో పాటు నల్లగొండ, మహబూబ్ నగర్  జిల్లాల్లో  రాత్రి పూట  తాళము వేసి వున్న ఇండ్లనే టార్గెట్ గా చేసుకుని  దొంగతనాలకు పాల్పడుతున్న (04) గురు  అంతర్ జిల్లా  దొంగల ముఠాను అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి  25 లక్షల విలువ గల  (20) తులాల బంగారు ఆభరణాలు, 1 కేజీ 800 గ్రాముల వెండి ఆభరణాలు మరియు ఒక వెండి చెంబు, పల్లెము(మొత్తం 2.5 కేజీలు),ఒక మోటార్ సైకిల్, రెండు లాప్ టాప్ లు, మౌస్, స్పీకర్,  నాలుగు సెల్ ఫోన్లు స్వాదీ నపరుచుకున్నట్టు జిల్లా ఎస్పీ  శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో  వివరాలు వెల్లడించారు.

ఈనెల  22 న నల్లగొండ టూ టౌన్ పోలీసు స్టేషన్ ఎస్ఐ వై సైదులు కు వచ్చిన సమాచారము మేరకు నల్లగొండ ఆర్‌టి‌సి బస్ స్టాండ్(Nalgonda RTC Bus Stand) ఎదురుగా వున్న సవేరా లాడ్జ్ లో రూము తీసుకుని అనుమానాస్పదంగా  ఉండటముతో  నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా  వారు చేసిన దొంగతనాలను ఒప్పుకున్నారు. కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం చెందిన  ఉబ్బని యోగేశ్వర్, నల్లగొండ పట్టణం బిటిఎస్ కు చెందిన  వల్లూరి యువరాజ్ చంద్ర, తుర్కయంజాల్ కు చెందిన  బాలెం రాజేష్, బాలాపూర్ కు చెందిన  దస్తర్ బండి షఫీ లు రాచకొండ కమీషనరేట్ పరిధిలో (03)   సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని (01) ష వరంగల్ కమీషనరేట్ పరిధిలో (04)  మహబూబ్ నగర్ జిల్లాలో  (01) జి  నల్లగొండ జిల్లాలో (14)  దొంగతనాలకు పాల్పడినారు. ఈ కేసును నల్లగొండ డి.ఎస్.పి  శివరాం రెడ్డి పర్యవేక్షణలో  టూ టౌన్ సీఐ   రాఘవ రావు  ఆద్వర్యంలో  ముఠాను పట్టిబడి చేసిన టూ టౌన్  సైదులు  నల్లగొండ రూరల్ ఎస్సై   సైదా బాబు  హెడ్ కానిస్టేబుల్ పాయిలి రాజు , కానిస్టేబుల్ లు లావూరి బాలకోటి , శంకర్, జానకిరామ్ యం.ఏ ఫరూక్  లను జిల్లా యస్పీ  అబినంధించి రివార్డ్ లు అందజేశారు.