calender_icon.png 23 July, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాస్ నెగ్గిన ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్

23-07-2025 03:33:58 PM

మాంచెస్టర్ వేదికగా(Manchester Test) భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న నాలుగో టెస్టు మ్యాచులో టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డిండ్ ఎంచుకుంది. ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ లో 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. తుదిజట్లులో మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగుతోంది. పేసర్ అన్షుల్ కాంబోజ్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నారు. నాలుగో టెస్టులు కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy), ఆకాశ్ దీప్ దూరం అయ్యారు. సాయిసుదర్శన్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్ కు జట్లులో చోటు దక్కింది.

భారత జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్,(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోజ్,

ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీపాప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్( కెప్టెన్), జెమీ స్మిత్( వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.