calender_icon.png 14 July, 2025 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల టైమ్‌టేబుల్ మార్చండి

27-06-2025 12:23:10 AM

ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల టైమ్ టేబుల్‌ను మారుస్తూ త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాల యంలో సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు.

అన్ని గురుకులాల సొసైటీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి ఉత్తుర్వులు జారీ చేస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్టు పింగలి పేర్కొన్నారు. సీఎస్‌ను కలిసిన వారిలో పీఆర్టీజీటీఏ నేతలు వేంరెడ్డి దిలీప్ రెడ్డి, రమేశ్, ఉప్పు అశోక్, శ్రీనివాస్‌రెడ్డి తదిత రులు ఉన్నారు.