23-07-2025 02:47:10 PM
బెజ్జంకి లో విద్యాసంస్థల బంద్ ప్రశాంతం
బెజ్జంకి: ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో(Educational Institutions) ఫీజుల నియంత్రణ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి డి.మహేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి సంఘాల బంద్ పిలుపు మేరకు బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బంద్ చేయడం జరిగిందని అన్నారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాలు తేవాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్, ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ స్కాలర్ షిప్ లు, ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను విడుదల చేయాలని, కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, అద్దె భవనంలో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భావనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హరీష్, చరణ్ ,వెంకటేష్ ,సాయి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు