23-07-2025 02:59:41 PM
నిర్మల్, (విజయ క్రాంతి): ఉపాధ్యాయులు(Teacher Problems) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్ అర్బన్ రూలర్ తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. విద్యారంగాన్ని ప్రభుత్వం ప్రవేటీకరణ చేసినందుకు చేస్తున్న కుట్రలను ఆపాలని ప్రభుత్వ పాఠశాలలో మెరుగు సదుపాయాలు కల్పించాలని ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆరే విజయకుమార్ ఎస్ మిరాజ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు క్రాంతికుమార్ మనోహర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు