14-04-2025 12:21:27 AM
యంగ్ హీరో రాజ్‌తరుణ్ నటిస్తున్న తాజాచిత్రం ‘పాంచ్ మినార్’. రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్ పై మాధవి, ఎంఎస్‌ఎంరెడ్డి నిర్మిస్తున్నారు. రాశీసింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది.
మేకర్స్ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో టాలీవుడ్ డైరెక్టర్ మారుతి టీజర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘చిన్న బడ్జెట్‌లో క్వాలిటీ ప్రోడక్ట్ తీయడం అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి. ఈ సినిమా కోసం అలాంటి కష్టాలు పడ్డారు. ఈ సినిమాతో రాజ్‌తరుణ్‌కు మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నా’ అని చెప్పారు.
టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో స్పాంటేని యస్ స్టార్ రాజ్‌తరుణ్ అనే టైటిల్ ఇవ్వాలని నిర్మాతల్ని కోరుతున్నా’ అన్నారు. హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కచ్చితంగా ఆడుతుందని చెప్పడానికి కారణం మా డైరెక్టర్ కష్టం.. ఆయన విజన్. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’ అని చెప్పాడు.
హీరోయిన్ రాశీసింగ్ మాట్లాడుతూ.. ‘ఇందులో నా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుం దనుకుంటున్నా’ అని తెలిపింది. డైరెక్టర్ రామ్ కందుల మాట్లాడుతూ.. ‘ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది’ అన్నారు. నిర్మాతలు ఎంఎస్‌ఎంరెడ్డి, గోవిందరాజు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో అందరినీ కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశాం’ అని తెలిపారు. డైరెక్టర్ సాయిరాజేశ్, అనంత శ్రీరామ్, ధీరజ్ మొగిలినేని, బ్రహ్మాజీ, విజయ్‌పాల్‌రెడ్డి, అజయ్ ఘోష్ డార్లింగ్ స్వామితోపాటు, చిత్రబృందం పాల్గొన్నారు.