calender_icon.png 10 May, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

09-05-2025 06:16:19 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం  దస్తురాబాద్ మండలం రేవోజిపేట గ్రామంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. శుక్రవారం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి తూకం వేసి రైస్ మిల్క్ వెంటనే తరలించాలని సిబ్బందికి సూచించారు. కాగా సిబ్బంది రైతులకు గన్ని సంచులు ఇవ్వడం లేదని దీంతో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వారు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ స్పందించి వెంటనే గన్ని సంచులు అవసరానికి తగినట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మండల అధికారులు ఉన్నారు.