09-05-2025 06:47:34 PM
హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ జిల్లా శివనగర్ కు చెందిన ప్రముఖ దళిత నేత సంఘీ ఎలేందర్ మాదిగకు ఈ ఏడాది దళిత రత్న అవార్డు లభించింది. తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా నాయకుడిగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు, దళితుల హక్కుల కోసం ఆయన నిబద్ధతను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. డా.బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల జయంతి సందర్భంగా 2025 సంవత్సరంలో షెడ్యూల్ కులాల వారితో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాలలో, ఇటుక రాజు మాదిగని వర్కింగ్ చైర్మన్‌గా నియమించిన ఉత్సవాల కమిటీ, ఆ కార్యక్రమాల్లో ఎలేందర్ మాదిగ చేసిన సేవను గుర్తించి మాదిగ రాజకీయ పోరాట సమితి(ఎం ఆర్ పి ఎస్) (టి) ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో, సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిటు పాక ప్రభాకర్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు బొక్కల వెంకటస్వామి మాదిగ చేతుల మీదుగా ఎలేందర్ మాదిగకు అవార్డు ప్రదానం జరిగింది.
తదనంతరం దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్ను రవి, ప్రజా సంఘాల నాయకులు సంఘీ ఎలేందర్ ని పూల భోకెలు శాలువాలతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎలేందర్ మాదిగ మాట్లాడుతూ “ఈ గౌరవం నాకు మరింత బాధ్యతను కల్పించింది. భవిష్యత్తులో కూడా దళితుల హక్కుల కోసం అంకితభావంతో పనిచేస్తాను” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి యాకంబ్ర చారి, తెలంగాణ ప్రజా పరిరక్షణ సమితి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జూపాక ప్రభాకర, హనుమకొండ జిల్లా అధ్యక్షులు కుమ్మరి లక్ష్మీనారాయణ, తెలంగాణ ప్రజా పరిరక్షణ సమితి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఠాకూర్ సునీత, దళిత హక్కుల పోరాట సమితి కిలవరంగల్ మండల ప్రధాన కార్యదర్శి రాచర్ల రాజేందర్, వరంగల్ మండల ప్రధాన కార్యదర్శి జన్ను శంకర్, హరిబాబు, మంద నవీన్, వేల్పుగొండ నర్సింగరావు, అరేపల్లి కుమార్, పోలేపాక రాజన్ బాబు, గ్యార మల్లయ్య, గుమ్మడి రమేష్, మేడిపల్లి లక్ష్మణ్, చింతకింది జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.