calender_icon.png 9 May, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక్ లాంటి డైరెక్టర్లే కావాలి

14-04-2025 12:22:54 AM

కోలీవుడ్ స్టార్ అజిత్‌కుమార్ హీరోగా నటించిన తాజాచిత్రం ‘గుడ్‌బ్యాడ్‌అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ రూపొందించింది. ఏప్రిల్ 10న విడుదలై, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోందీ సినిమా. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్‌బస్టర్ సంభవం పేరుతో సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అధిక్ మాట్లాడుతూ.. ‘ప్రతి డైరెక్టర్ డ్రీమ్.. మైత్రి మూవీ మేకర్స్‌తో పనిచేయడమే’ అన్నారు. ‘అధిక్  ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఇంత గ్రాండ్ స్కేల్ సినిమాను ఆయన 95 రోజుల్లో పూర్తిచేయడం మామూలు విషయం కాదు. అధిక్ లాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీకి కావాలి’ అని నిర్మాత నవీన్ అన్నారు. ‘ఈ సినిమాలో నేను చేసిన పాత్రతో నన్ను చాలా రోజుల తర్వాత మళ్లీ వైరల్ చేశారు’ అని ప్రియా ప్రకాశ్ వారియర్ తెలిపింది. నటుడు సునీల్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌కుమార్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.