09-05-2025 06:44:03 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): హైదరాబాదులో ఈనెల 8న త్యాగరాయ గాన సభలో తెలుగు భాష చైతన్య సమితి నిర్వహించిన తెలుగు భాషకు పట్టాభిషేకం కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని అమీనాపురం చెందిన కవి దండు శ్రీనును సన్మానించారు. కవి సమ్మేళనంలో శీను వచన కవితా గానం చేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపకులు భడే సాబ్, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాసిం, వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం దండు శీనుకు ప్రశంసా పత్రం అందించి సత్కరించారు.