calender_icon.png 10 May, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించవద్దు

09-05-2025 06:13:07 PM

నిర్మల్,(విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన సమాచారాన్ని ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడం పై శుక్రవారం నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కు సమాచార అప్పు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యం లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ హైదర్, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్ కుమార్, జాతీయ మానవ హక్కుల సహాయ సంఘం నిర్మల్ జిల్లా చైర్మన్ శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. నిర్మల్ మున్సిపాలిటీకి వివిధ పథకాల కింద వచ్చిన దరఖాస్తుల సమాచారాన్ని ఇవ్వాలని అధికారులకు కోరిన వారు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు మున్సిపల్ కమిషనర్ కు వివరించారు.

  కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశార సమాచార హక్కు చట్టంపై అధికారులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమాచార హక్కు చట్టం 2005 లోని సెక్షన్ 6(1) ప్రకారం సంబంధిత అధికారులు దరఖాస్తుదారునికి సహకరించాల్సి ఉందన్నారు. దరఖాస్తుదారుడు కోరుతున్న సమాచారం అదే ప్రభుత్వ యంత్రాంగానికి చెందినది కానట్లయితే  ఆ దరఖాస్తును పౌర సమాచార అధికారి సంబంధిత ప్రభుత్వ యంత్రాంగానికి సెక్షన్ 6(3) ప్రకారం పంపించాల్సి ఉంటుందన్నారు. అయితే దరఖాస్తుల తీసుకోకుండా అధికారులు సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమవుతుందని,  శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు అవగాహన పెంచుకొని సక్రమంగా అమలు జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలొ స.హా. చట్ట పరిరక్షణ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ సాదిక్, తదితరులు పాల్గొన్నారు.