09-05-2025 06:25:24 PM
బుగ్గ ఆలయంలో ప్రత్యేక హోమం
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): భారత్-పాకిస్థాన్(India-Pakistan War) మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ విజయం సాధించాలని, ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) సక్సెస్ కావాలని బెల్లంపల్లి శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు, హోమం నిర్వహిoచారు. దేవాలయ కార్యనిర్వహణ అధికారి బాపురెడ్డి, ఆలయ చైర్ పర్సన్ మసాడి శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి పాల్గొని మాట్లాడారు.
పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్రవాదులు భారత దేశానికి చెందిన హిందువులను ప్రత్యేక లక్ష్యంగా చేసుకుని అమాయకులను వారి భార్య, కుటుంబ సభ్యుల ముందే విచక్షణ రహితంగా కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ యుద్ధంతో చనిపోయిన కుటుంబాలకు శాంతి కలగాలనన్నారు.ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించాలని, ఆర్మీ జవాన్లకు, భారత సైన్యానికి , దేశ ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదని దేవున్ని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్పర్సన్ మాసాడీ శ్రీదేవి, శ్రీరాములు, బిజెపి జిల్లా కార్యదర్శి గోవర్ధన్, శ్రావణ్ కుమార్, మాజీ సర్పంచ్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.