calender_icon.png 10 May, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినియోగదారుల హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా బాల సాయి ప్రసాద్

09-05-2025 05:56:09 PM

చేగుంట,(విజయక్రాంతి): జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ మెదక్ జిల్లా చైర్మన్ గా బాలసాయి ప్రసాద్ కు నియామక పత్రం అందజేసినట్లు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎంవిఎల్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బాలసాయి ప్రసాద్ మాట్లాడుతూ తనకు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్మన్ గా నియమించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతాన్ పల్లి గ్రామానికి చెందిన బాలసాయి ప్రసాద్ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ మెదక్ చైర్మన్ గా  మారుమూల గ్రామ ప్రాంతం నుండి నియామకమయ్యారు.

ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను మనస్సాక్షిగా, క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. తనకు మెదక్ జిల్లా చైర్మన్ గా  బాధ్యతలు అప్పగించిన వ్యవస్థాపక జాతీయ చైర్మన్ డాక్టర్ ఎంవిఎల్ నాగేశ్వరరావు కు కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ గా తన ఎంపికకు సహకరించిన జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ పొట్టపెంజర రమేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ద్వారా వినియోగదారులు నేరుగా మార్కెట్లో పాల్గొనేలా చేయడంతో పాటు, ప్రజా సంక్షేమాన్ని సాధించడానికి కృషి చేస్తామన్నారు.

ప్రైవేటు, ప్రభుత్వ రంగాలకు చెందిన అన్ని వస్తువులు, సేవలు, జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ పరిధిలోకి వస్తాయన్నారు. వినియోగదారుల హక్కులను అమలు చేయుటకు తయారీదారులు, వ్యాపారులు, విక్రేతలు, సేవల ప్రధాతల  దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటానికి జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ వినియోగదారుల చేతుల్లో ఒక ఆయుధం లాగా పనిచేస్తుందని పేర్కొన్నారు. మెదక్ జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్మన్ గా ఎన్నికైన బాలసాయి ప్రసాద్ ను పలువురు అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు.