calender_icon.png 8 January, 2026 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన శంకరవరప్రసాద్ గారు, రాజాసాబ్‌కు ఊరట

07-01-2026 01:20:03 PM

హైదరాబాద్:  'ది రాజా సాబ్', 'మన శంకర వరప్రసాద్‌గారు' చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు పుష్ప2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ2 చిత్రాలకు పరిమితం చేసింది. సినీ నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పు రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలకు వర్తించదని డివిజన్ బెంచ్ సూచించింది. ఈ రెండు భారీ చిత్రాల టికెట్ల ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ హోంశాఖ ప్రధాన కార్యదర్శికి ఉందని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల పండుగ ప్రారంభం కాబోతున్న తరుణంలో, మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న 'ది రాజా సాబ్', 'మన శంకర వర ప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu) వంటి భారీ బడ్జెట్ చిత్రాల టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ రెండు సినిమాలపై భారీగా డబ్బులు పెట్టుబడి పెట్టి ఉండటంతో, సంక్రాంతి పండుగ సమయంలో సినిమాలకు ఉండే విపరీతమైన రద్దీని, డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి నిర్మాతలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ టిక్కెట్ల ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు పొందడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే రెండు ప్రభుత్వాల నుండి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, 'ది రాజా సాబ్', 'మాన శంకర్ వర ప్రసాద్ గారు' చిత్రాల నిర్మాతలు పండుగ సమయంలో తమ పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి టిక్కెట్ల ధరలను పెంచడానికి, అదనపు షోలను ప్రదర్శించడానికి అనుమతులు కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్లు దాఖలు చేశారు. గత సంవత్సరం, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సినిమా టిక్కెట్ల ధరలను పెంచవద్దని ఒక సింగిల్ బెంచ్ న్యాయమూర్తి కఠినమైన ఉత్తర్వులు జారీ చేశారు.