21-05-2025 07:00:59 PM
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్గొండ మండలం అప్పాజిపేట పరిధిలోని బంటుగూడెంలో బుధవారం మధ్యాహ్నం పిడుగుపడి మహిళా రైతు జాల బిక్షవమ్మ(46) మృతి చెందింది. వ్యవసాయ బావి వద్ద తోటలో పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంలో ఆమెపై పిడుగుపడటంతో అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలికి భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గ్రామంలో పిడుగుపడడంతో రైతులు, కూలీలు భయాందోళనకు గురయ్యారు.