calender_icon.png 22 May, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాబోధనలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించాలి

21-05-2025 07:35:50 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రాథమిక విద్యలో ఆధునిక టెక్నాలజీని వినియోగించి చిన్నతనం నుండే విద్యార్థులకు ఆధునిక విద్యాబోధన అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మండల విద్యాధికారులు కోరారు. సెకండరీ గ్రేడ్ టీచర్లకు విద్యాబోధనపై మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో శిక్షణ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా రిసోర్స్ పర్సన్ ప్రవీణ్ మరిపెడలో మాట్లాడుతూ... ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం ఐదువేల ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ లను నెలకొల్పి ఆధునికత జోడించి విద్యాబోధనకు శ్రీకారం చుట్టిందన్నారు. ఉపాధ్యాయులు మారుతున్న కాలానికి అనుగుణంగా సామర్థ్యాలను పెంపొందించుకొని విద్యా ప్రమాణాలను బలోపేతం చేసి నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. శిక్షణ కార్యక్రమాలు అభ్యాసనాభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.