calender_icon.png 22 May, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ దుకాణాల్లో అధికారుల తనిఖీ

21-05-2025 07:15:17 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వం నియంత్రించిన ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని నిర్మల్ మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్(Nirmal Municipal Sanitary Inspector Devidas) వ్యాపారస్తులను హెచ్చరించారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని కొత్త బస్టాండ్ పాత బస్టాండ్ శివాజీ చౌక్ నారాయణరెడ్డి మార్కెట్ తదితర ప్రాంతాల్లో వ్యాపార దుకాణాల్లో తనిఖీ చేసి 20 మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకొని దుకాణాలకు నోటీసులు, జరిమానా విధించినట్టు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని వ్యాపారులకు సూచించారు.