21-05-2025 07:03:28 PM
ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యమని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్(District SP Sudhir Ramnath Kekan) అన్నారు. అధునాతన సౌకర్యాలతో పునరుద్ధరించిన తొర్రూర్ సర్కిల్ ఆఫీసును ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్లను ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతి పౌరుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చినపుడు సౌకర్యవంతంగా ఫిర్యాదు చేయగలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పోలీస్ స్టేషన్‌లో ఆధునిక సాంకేతిక పరికరాలు, వేయిటింగ్ హాల్లు, మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు, సీసీ కెమెరాలు, తాగునీరు ఏర్పాట్లతో పునరుద్ధరించిన పోలీస్ స్టేషన్లలో పోలీసులు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలతో సంబంధాలను మెరుగుపర్చేందుకు, పోలీస్ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణ కిషోర్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.