calender_icon.png 22 May, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక విద్యను సులభంగా బోధించాలి

21-05-2025 06:51:38 PM

మెదక్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ గంగయ్య..

దౌల్తాబాద్ (విజయక్రాంతి): ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రాథమిక విద్యను అందించాలని డైట్ ప్రిన్సిపల్ గంగయ్య(Diet Principal Gangaiah) అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మండల స్థాయి ఉపాధ్యాయుల రెండవ రోజు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మారుతున్న సమాజానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ అందించి పాఠశాల స్థాయిలో అది వినియోగించబడాలని అన్నారు.

నేడు నడుస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఏ విధంగా అయితే చలామణి అవుతుందో దానికి అనుగుణంగానే విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. మండల స్థాయిలో శిక్షణ పొందుతున్నటువంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అందించాలని వారి భవిష్యత్తుకు మంచి పునాది వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కనకరాజు, రిసోర్స్ పర్సన్స్ వేణుగోపాల్, మెరజ్ బేగం, త్యాగరాజు, ప్రశాంత్, సర్దార్ హుస్సేన్, అనిత, శివకుమార్, సిఆర్పిలు రాజు, కుమార్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.