calender_icon.png 22 May, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీ ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి..

21-05-2025 06:55:48 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం లారీ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ పట్టణంకి చెందిన శ్రవణ్ కుమార్ అనే బ్యాంకు ఉద్యోగి కరీంనగర్ నుండి వరంగల్ పోతున్న క్రమంలో లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని హుజురాబాద్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.