21-05-2025 07:11:12 PM
డ్రైనేజీలు శుభ్రం లేక పోటెత్తిన మురికి నీరు..
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంకాలం సుమారు గంట పైచిలుకు వర్షం హోరున కురిసింది. దీంతో వాతావరణం వేడి ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశంలో మబ్బులు చీకట్లు కమ్మి వాహనాలు లైట్లు వేసుకొని నడపాల్సి వచ్చింది. కాగా ముందస్తుగా మున్సిపాలిటీ సిబ్బంది డ్రైనేజీలు, రోడ్లు, శుభ్రం చేయాల్సి ఉండగా అలాంటి దిశగా చర్యలు చేపట్టకపోవడంతో డ్రైనేజీలు పూడుకుపోయి వర్షం నీరు రోడ్లపైకి పొంగిపొర్లి వచ్చాయి. దీంతో పట్టణంలోని రోడ్లు జలమయమై రాకపోకలకు అంతరాయం కలిగింది. మార్కెట్ యార్డులో ఉన్న వరి ధాన్యం రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.