calender_icon.png 2 May, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటితో ముగియనున్న రాజీవ్ యువ వికాస దరఖాస్తులు

14-04-2025 12:00:00 AM

కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 13 ( విజయ క్రాంతి ): నిరుద్యోగ ఎస్ సి,  ఎస్ టి, బి సి, మైనారిటీ ,ఓ బి సి, ఈ బీసీ యువతకు అమలు పరుచబడు రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తులు చేసుకొనుటకు  నేటి తో ముగుస్తుంది అని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసం కింద ఇప్పటి వరకు జిల్లాలో 30299 దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరిగిందని తెలిపారు.

అందులో, 19512 మంది దరఖాస్తుదారులు దరఖాస్తులను, సంబంధిత మండల కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాల లో, మున్సిపాల్టీ కార్యాలయాల్లో అందజేసినారు. ఇంకనూ,  10787 దరఖాస్తులను సమర్పించవలసియున్నది. కావున, దరఖాస్తు చేసుకున్న ఎవరైతే దరఖాస్తులను అందజేయలేదో వారు సంబంధిత మండల కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో మరియు మున్సిపాల్టీ కార్యాలయాల్లో అందజేయాలని కోరనైనది.

ఎస్ సి  యువత రూ.1.00 లక్ష యూనిట్లకు (బ్యాంకు సంబంధముతో) బ్యాంకు సంబంధంలేకుండా అమలుపరుచబడు  రూ.50 000/- యూనిట్లకు తక్కువ దరఖాస్తులు చేసుకున్నందున, అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకొన వలసినదిగా యస్.సి. యువతను కోరడమైనది. యువత వారి కాళ్లపై వారు నిలబడి  స్వయం ఉపాధి పొందెందుకు ఇది చక్కటి అవకాశమన్నారు.