calender_icon.png 2 May, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ పత్రాలతో రోడ్డు కబ్జా

14-04-2025 12:00:00 AM

  1. ముంబై జాతీయ రహదారి సమీపంలో రూ 10 కోట్ల విలువ చేసే మంజీరా పైప్ లైన్ స్థలం కబ్జా
  2. మౌనం పాటిస్తున్న మూడు శాఖల అధికారులు 
  3. - అప్పుడు అక్రమం ఇప్పుడు సక్రమం...
  4. - అధికారుల మౌనం వెనుక మతలబు ఏంది?

శేరిలింగంపల్లి,ఏప్రిల్ 13(విజయక్రాంతి): నిరుపేదలు  గూడు కోసం ప్రభుత్వ భూ ముల్లో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తే....అధికారులు నానా హంగామా చేసి వాటిని తొలగించి కేసులు పెట్టి జైలుకు పం పుతారు... అలాంటిది రూ. 10 కోట్లకు పైగా విలువ చేసే 447 గజాల ప్రభుత్వ స్థలాన్ని  కబ్జా చేసి యథేచ్ఛగా ప్రహరీ గోడ నిర్మించి ఆక్రమణ చేసిన... అధికారులో చలనం లేదు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులే... తమకు ఏమి పట్టనట్టు వ్యవరిం చడంతో  సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నా యి.

వివరాల్లోకి వెళితే శేరిలింగంపల్లి మండలం చందానగర్ డివిజన్ పరిధిలోనీ సర్వే నంబర్ 225, ప్లాట్ నెంబర్ 24, ముంబై హైవే ప్రధాన రహదారి పక్కనే ప్రభుత్వ భూమిపై అక్రమార్కులు  కన్నేసి పాగా వేశా రు. ఈ విషయం తెలిసి కూడా రెవెన్యూ శాఖ ,జిహెచ్‌ఎంసి అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఆ భూమిలో ప్రజావసరాలకు ఉపయోగపడేందుకు అండర్ గ్రౌండ్ మంజీరా వాటర్ లైన్ ఉండటం విశేషం. 

నోరు మెదుపనీ మూడు శాఖలు మియాపూర్ లోని జాతీయ రహదారికి

ఆనుకుని ఉన్న సబ్ రోడ్ కబ్జా జరుగుతున్న అటు జలమండలి అధికారులు కానీ ఇటు జిహెచ్‌ఎంసి అధికారులు కానీ జాతీ య రహదారికి సంబంధించిన అధికారులు స్పందించకపోవడం పట్ల స్థానికులు అగ్రం వ్యక్తం చేస్తున్నారు దీని వెనక ఎవరైనా పెద్దల హస్తం ఉందా లేక సదరు వ్యక్తికి భయపడుతున్నారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఓ వ్యక్తి రహదారికి అనుకుని ఉన్న 447 గజాల స్థలం తమకు ఉంది.

ఇది ప్రైవేటు భూమి అంటూ ఈ స్థలము నాది అంటూ అధికారులకె సవాలు చేస్తూ పట్టపగలే ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టిన అధికా రులు తమకు ఏమీ తెలవదు అన్నట్లుగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇది రోడ్డు కద  కబ్జా ఎలా చేస్తారు అని కాలనీ వాసులు అడుగుతున్న అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. జిహెచ్‌ఎంసి చందనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం తాము నోటీసులు ఇచ్చాం తమ పని అయిపోయింది అంటూ చేతులెత్తేశారు.

అప్పుడు అక్రమం ఇప్పుడు సక్రమం....

రెండు నెలల క్రితం అదే స్థలం పక్కన కార్ మెకానిక్ షెడ్ ను రోడ్డు కబ్జా చేశారని చందానగర్ సర్కిల్ 21 టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఇప్పుడు ఆ స్థలం పక్కనే జాతీయ రహదారికి అనుకొని ఉన్న సబ్ రొడ్డును కబ్జా చేసి ప్రహరీ గోడను నిర్మించిన అదికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు అంటున్నారు. కబ్జా చేసిన వ్యక్తిని స్థానికులు వెళ్లి నిలదీయగా నేను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డితో అన్ని విషయాలు మాట్లాడుకొని ప్రహరీ నిర్మించడానికి అనుమతులు తీసుకున్నానని నన్ను ఎవరు ఏమి చేయలేరని పి ఒక్క అధికారి కూడా నా దగ్గరికి రాడని స్థానికులపై కబ్జాదారుడు మండిపడుతున్నారు.

జాతీయ రహదారి పక్కనే ఉండటంతో కబ్జాకు యత్నం

ఈ భూమి ముంబై జాతీయ రహదారిని ఆనుకుని ఉండడం, భూముల ధరలు బాగా పెరగడంతో మదినగూడ కు చెందిన ఓ కబ్జాదారుడి కన్నుపడింది. అధికారులను మచ్చిక చేసుకొని ఈ భూమిని స్వాధీనపరచుకున్నాడు.  ఈ విషయంపై ఎవరైనా అడిగితే అది తన భూమిగా చెప్పుకోవడం విశేషం. ఇంత జరుగుతున్నా రెవెన్యూ శాఖ జిహెచ్‌ఎంసి అధికారులు కబ్జాకు గురైన ఈ భూమి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఇప్పటికైనా దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కొరుతున్నారు. ఈ అక్రమ కట్టడంపై ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. చందానగర్ డివిజన్ మియాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో అక్రమ కట్టడంపై పరిశీలించిన అనంతరం చర్యలు చేపడతాం 

 చందానగర్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి