08-08-2025 05:45:19 PM
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): పట్టణంలోని మార్గదర్శిని గ్రూప్ ఆఫ్ స్కూల్స్(Margadarshini Group of Schools)లో రాఖి పౌర్ణమి పురస్కరించుకొని వేడుకలను ఘనంగా వేడుకలు నిర్వహించారు. పాఠశాలలోని నర్సరీ నుంచి పదవ తరగతి వరకు అన్న చెల్లెల ఆత్మీయత అనురాగాలు వెళ్లి విరిసేలా విద్యార్థినిలు విద్యార్థులకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, యాదగిరి రాంబాబు, ఆర్వపల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ, పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు సోదరభావంతో ఆత్మీయ అనురాగాలతో కలిసి మెలిసి ఉండాలని విద్యార్థులందరికీ రాఖి విశిష్టతను తెలియజేసేందుకు రాఖీ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు.