calender_icon.png 25 August, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు

19-05-2025 03:08:42 PM

ప్రైవేట్ స్థలంలో వెలిసిన షేడ్లు తొలగింపు

కూకట్‌పల్లి,(విజయక్రాంతి): కూకట్‌పల్లి సర్కిల్ హైదర్ నగర్ డివిజన్లో సోమవారం హైడ్రా అధికారులు కూల్చి వెతలు చేపట్టారు. సర్వే నెంబర్ 145/3 తొమ్మిది ఎకరాల 27 గుంటల స్థలాన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసి లే అవుట్ నిర్మించారు. ఈ లే అవుట్ 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసుకొని 79 ప్లాట్లు చేసుకున్నారు. అయితే 2007 సంవత్సరంలో ఎన్ఎస్డీ ప్రసాద్(NSD Prasad), డైమండ్ హిల్స్ ప్లాట్(Diamond Hills Plot) కొనుగోలుదారుల మధ్య వివాదం కొనసాగింది. అప్పటి నుంచి ఇది వ్యవసాయ భూమి అని, ఆ స్థలం ఆయన స్వాధీనంలోనే ఉండిపోయింది.

ప్లాట్ ఓనర్స్ కోర్టును ఆశ్రయించగా 2024 సెప్టెంబర్ 9న ప్లాట్ ఓనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో గత సోమవారం హైడ్రా కార్యాలయం(Hydra Office)లో ప్లాట్ ఓనర్స్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) స్పందించి ఇరువురిని పిలిచి వారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించాడు. ఈ స్థలం ప్లాట్ ఓనర్స్ కి దక్కుతుందని నిర్ధారణకు వచ్చి వారం రోజుల్లో కూల్చివేతలు చేపట్టి సమస్యను పరిష్కరించడంతో కాలనీవాసులు హైడ్రాక్ కమిషనర్ రంగనాథ్, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.