calender_icon.png 8 October, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి

08-10-2025 08:01:13 PM

ప్రయాణికులకు అవగాహనలో రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు..

రామగుండం (విజయక్రాంతి): ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరని ప్రయాణికులకు అవగాహనలో రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు కోరారు. బుధవారం రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా రామగుండం కమిషనరేట్ లోని స్థానిక మున్సిపల్ ఆఫీస్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఎస్ఐ హరి శేఖర్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది హెల్మెట్ లేని వాహనాలను ఆపి వాహనదారులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించడంతో పాటు వారిచే ప్రతిజ్ఞ చేయించారు. టు వీలర్ పై ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడే హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకుంటానని వారిచే ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ లేకపోవడం వలన ఆక్సిడెంట్లు జరిగి ప్రాణాపాయం జరుగుతుందని సీఐ తెలియజేశారు.