calender_icon.png 10 August, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాంచందర్‌రావుకు వ్యవసాయంపై అవగాహన లేదు

28-07-2025 01:07:32 AM

-కేంద్రం ఇచ్చింది 9.80 ఎల్‌ఎంటీ  మాత్రమే 

-రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు వ్యవసాయరంగంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి తు మ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఒక రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా ఉం టూ ఎలాంటి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని ఆది వారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసిందని చెప్పడం చూస్తుం టే తెలంగాణ రైతులపై వారికున్న నిబద్దత ఎంటో తెలుస్తుందన్నారు. రైతుల విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వొద్దని, యూరి యా కోసం ఎన్నోసార్లు విన్నవించినా కేంద్రం పట్టించుకోవడం లేద ని మంత్రి ఆరోపించారు. రాష్ట్రానికి ఈ ఖరీఫ్ సిజన్ మొత్తానికి కేవలం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూ రియా మాత్రమే వచ్చిందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రికి లెక్కలతో సహా వివరించామన్నారు.