calender_icon.png 12 August, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడిగా రాజగోపాల్

28-07-2025 01:08:18 AM

ప్రధాన కార్యదర్శిగా మురళీ మోహన్ నాయక్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (విజయక్రాంతి): సిటి సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ శశిధర్‌రెడ్డి ఎన్నికల అధికారిగా 2025 కాలానికి తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నెల 19న ఎన్నికలు జరగగా, ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఖమ్మం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జీ రాజగోపాల్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా మురళీమోహన్ ఎన్నికయ్యారు.

జే మైత్రేయి మహిళా ప్రతినిధిగా, ఉపాధ్యక్షులుగా డీ దుర్గ ప్రసాద్, జీ వేణు, ఉ పాధ్యక్షురాలిగా పీ లక్ష్మి శారద, సహ కా ర్యదర్శులుగా డాక్టర్ సంపత్, పీ శ్రీదేవి, ఎం రాజు, కార్యనిర్వాహక సభ్యులుగా ఎండీ గౌస్ పాషా, ఎ కిరణ్ కసమల, శ్యామ్ ప్రసాద్, బీ కల్పన, శివ నాయక్, జీ హిమబిందు, మొహమ్మద్ అసదు ల్లా షరీఫ్, కే గోపికృష్ణ, జే ఉపేందర్‌రావు, ఎన్ అరుణ్ కుమార్, కే పూజ, ఖుష్బూ ఉపాధ్యాయ ఎన్నికయ్యారు.