calender_icon.png 5 November, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి

05-05-2024 12:48:21 AM

వరంగల్, మే 4 (విజయక్రాంతి): వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తయిందని వరంగల్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల పరిశీలకుడు బండారి స్వాగత్ రణవీర్ చంద్‌ల సమక్షంలో ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ శ్రీనివాస్, ఆర్డీఓ సిదం దత్తు, కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్, పర్యవేక్షకుడు విశ్వనారాయణ, విజయ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.