calender_icon.png 5 November, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

05-05-2024 12:49:46 AM

మహబూబ్‌నగర్, మే 4 (విజయక్రాంతి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో చిరు వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రతి క్షణం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు.