నీటి పారుదల శాఖ సీనియర్ కన్సల్టెంట్ రంగారెడ్డి మృతి
28-05-2024 01:30 AM
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
హైదరాబాద్, మే 27( విజయక్రాంతి) : నీటి పారుదలశాఖ సీనియర్ కన్సెల్టెంట్ రంగారెడ్డి మృతి చెందారు. గతంలో ముఖ్యమంత్రి సలహదారుగా పని చేసిన రంగారెడ్డి ఇటీవలే నీటిపారుదలశాఖకు కన్నల్టెంట్‌గా నియమితులయ్యారు. ప్రమాదవశాత్తు కాలు విరిగి ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. రంగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, రంగారెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ మండలం గన్యాగులకు చెం దిన ఆయన మరణం ఈ ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు.






