24-11-2025 08:17:22 PM
తహశీల్దార్ శ్రీకాంత్..
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తహశీల్దార్ బాషపాక శ్రీకాంత్ కోరారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత కొన్నెల్లుగా గ్రామాల్లో ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న పేద రైతులకు ప్రభుత్వం వెంటనే పట్టాలను మంజూరీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, తిమ్మాపురం గ్రామ మాజీ సర్పంచ్ జీడి వీరస్వామి అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పల్లపు ఝాన్సీ, పీఆర్ ఏఈ కుమారస్వామి, ఇరిగేషన్ ఏఈ హరిస్వరూప్, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ నవీన్ కుమార్, హౌసింగ్ ఏఈ పూజశ్రీ, ఎంపీఓ గోపి,ఏపీఓ ఉపేందర్,రైతులు జీడి నాగరాజు, సైదులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.