స్కాముల తెలంగాణ
- రెండున్నరేళ్ల పాలనలో 19 కుంభకోణాలు
అన్ని ప్రభుత్వశాఖల్లో యథేచ్ఛగా అవినీతి
మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రమేయంతోనే అక్రమాలు
చిత్తశుద్ధి ఉంటే కుంభకోణాలపై విచారణ జరిపించాలి
సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్ సభా పక్షం లేఖ
స్పీకర్‌కు లేఖ అందించి సీఎంకు చేరవేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాం తి): ‘మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో రాష్ట్రం కుంభకోణాలకు కేంద్రమైంది. అడుగడుగునా ఒక స్కాం వెలుగు చూస్తున్నది. అలా ఇప్పటివరకు 19 కుంభకోణాలు వెలుగుచూశాయి. మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ప్ర మేయంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నా యి. కుంభకోణాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ప్రజలు మీపై నమ్మకం ఉంచి అధికారం కట్టబెడితే, నట్టేట ముంచా రు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి ఆదివారం బీఆర్‌ఎస్ సభా పక్షం లేఖ రాసింది. ఈ మేరకు లేఖను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అందజేసి సీఎంకు చేరవేయాలని విజ్ఞ ప్తి చేసింది. ‘అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార దుర్వినియోగం యథేచ్ఛగా సాగుతు న్నది.
వాటిని అడ్డుకోవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమేయంతోనే కుంభకోణాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. కుంభకోణాల ఫలితంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనం కొద్దిమంది ప్రజా ప్రతినిధుల చేతుల్లోకి వెళ్లింది. అభివృద్ధి కుంటుపడింది. ప్రజలకు అన్యాయం జరిగింది. మీరు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రజాపాలన వట్టిమాటగానే మిగిలిం ది. అవినీతిని అరికట్టడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
ఈ దోపిడీని చూస్తే, సీఎంగా మీరు స్వయంగా ప్రోత్సహిస్తున్నారనే అనుమానం కలుగుతున్నది. అవినీతి, కుంభకోణాలపై ఎవరైనా లేఖ రాస్తే విచారణ జరుపుతామని మీరు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కాబట్టి, మీ పాలనలో జరిగిన కుంభకోణాల వివరాలను మీకే అందిస్తు న్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే, వెంటనే సిట్టింగ్ జడ్జీతో కుంభకోణాలపై విచారణ చేయించండి’ అనేది లేఖ సారాంశం
బీఆర్‌ఎస్ పేర్కొన్న కుంభకోణాలివి..
సివిల్ సప్లైస్ స్కాం
అమృత్ టెండర్ల స్కాం
కేఎల్‌ఎస్‌ఆర్ స్కాం
నైనీ కోల్ బ్లాక్ సింగరేణి స్కాం
సింగరేణి ఓబీ స్కాం
సోలార్ పవర్ స్కాం
ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కాం
హెచ్‌సీయూ భూముల స్కాం
లగచర్ల ల్యాండ్ స్కాం
కోటి ఎకరాల భూమి నిషేధిత
జాబితా స్కాం
ఎక్సైజ్ మైక్రో బ్రూవరీ స్కాం
హ్యామ్ రోడ్స్ స్కాం
టీడీఆర్ స్కాం
యంగ్ ఇండియా స్కూల్స్ స్కాం
ఫోర్త్ సిటీ స్కాం
హిల్ టీపీ స్కాం
అక్రమ మైనింగ్ స్కాం
డెక్కన్ సిమెంట్స్ స్కాం
మంచిరేవుల ఆలయ భూముల స్కాం




