calender_icon.png 16 January, 2026 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్లో ముగ్గుల పోటీలు

16-01-2026 02:27:37 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను నివారించడంలో రోడ్డు భద్రతపై అవగాహన ఎంతో అవసరమని అందులో భాగంగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు నేడు స్థానిక పోలీస్ స్టేషన్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. కావున మండలంలోని ప్రజలందరూ పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని,సురక్షిత రహదారుల వెంబడి వెళ్తూ సురక్షిత జీవనం గడపాలని ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.నేడు ఉదయం ఏడు గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ముగ్గుల పోటీలు ఉంటాయన్నారు.ముగ్గుల పోటీలో గెలుపొందినవారికి ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు.