16-01-2026 02:25:54 PM
ప్రతి పేదవాడికి తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుంది.
డాక్టర్ కూరపాటి రమేష్ (MS)
మరిపెడ, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎలమంచి తండా గ్రామపంచాయతీ సర్పంచ్ బానోతు బద్రి నాయక్ ను కొరపాటి లేజర్ లాప్రోస్కోపిక్ సెంటర్ హాస్పిటల్ బృందం స్థానిక గ్రామపంచాయతీ ఆఫీస్ లో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం హాస్పిటల్ బృందం మాట్లాడుతూ కూరపాటి లేజర్ లాప్రోస్కోపిక్ హాస్పిటల్ బృందం హనుమకొండ నందు ప్రతి పేదవాడికి ప్రతి సామాన్యుడికి వైద్యం ఖర్చుతక్కువతో అందుతుందని, మా హాస్పిటల్లో అందరికీ అందుబాటులో లేజర్ ఫైల్స్ చికిత్స, లాప్రోస్కోపిక్ చికిత్సలు అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా చికిత్సను అందిస్తామన్నారు. సర్పంచ్ బద్రు నాయక్ మాట్లాడుతూ ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఇంచార్జ్ జనార్దన్, నర్సింగ్ ఆఫీసర్ భూఖ్య సౌందర్య, మాజీ వార్డ్ మెంబర్ వీరన్న, డ్రైవర్ దినేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరన్న నాయక్, తదితరులు పాల్గొన్నారు.