calender_icon.png 19 November, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసీసీ అవార్డు రేసులో శ్రేయాంక

28-12-2024 11:21:50 PM

దుబాయ్: భారత యువ క్రికెటర్ శ్రేయాంక పాటిల్ ప్రతిష్ఠాత్మక ఐసీసీ మహిళల ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయింది. గతేడాది డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శ్రేయాంక 13 టీ20ల్లో 15 వికెట్లు, ఆడిన రెండు వన్డేల్లో నాలుగు వికెట్లు పడగొట్టింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంది. శ్రేయాంక పాటిల్‌తో పాటు అన్నెరి డెర్క్‌సెన్ (సౌతాఫ్రికా), సాస్కియా (స్కాట్లాండ్), ఫ్రెయా సర్జెంట్ (ఐర్లాండ్) అవార్డు రేసులో ఉన్నారు.