calender_icon.png 19 November, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయానికి 121 పరుగుల దూరంలో..

28-12-2024 11:25:42 PM

సౌతాఫ్రికా, పాకిస్థాన్ తొలి టెస్టు

సెంచూరియన్: స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా విజయానికి దగ్గరైంది. 148 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. మార్కరమ్ (22), బవుమా క్రీజులో ఉన్నారు. పాక్ గెలుపుకు 7 వికెట్ల అవసరముంది. అంతకముందు పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. సాద్ షకీల్ (84), బాబర్ ఆజం (50) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. రబాడ 2 వికెట్లు పడగొట్టాడు. డబ్ల్యూటీసీ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ 2023 పట్టికలో సౌతాఫ్రికా తొలి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. పాక్‌పై గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోనుంది.