calender_icon.png 18 November, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మాయిలపై జరిగే అత్యాచారాలను అరికట్టాలి, మహిళలకు భద్రత కల్పించాలి

18-11-2025 06:08:44 PM

ముకరంపుర (విజయక్రాంతి): అమ్మాయిలపై జరిగే అత్యాచారాలను అరికట్టాలని, మహిళలకు భద్రత కల్పించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ డిమాండ్ చేశారు.  మంగళవారం కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమైందని అన్నారు. షీ టీమ్స్ ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయడం లేదని, మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమవుతుందని అన్నారు.

దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అధికంగా అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాంపెల్లి అరవింద్, గజ్జెల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్, బోగేష్, ఆకాష్ జిల్లా గర్ల్ నాయకులు మానస, అమూల్య, విద్యార్థులు  పాల్గొన్నారు.